కేజ్రీవాల్​కు ఆరోసారి ఈడీ సమన్లు

కేజ్రీవాల్​కు ఆరోసారి ఈడీ సమన్లు

న్యూఢిల్లీ :  ఢిల్లీ సీఎం, ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్​ అర్వింద్ కేజ్రీవాల్‌‌కు ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బుధవారం ఆరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో మనీలాండరింగ్ ​వ్యవహారానికి సంబంధించి ఈ నెల 19న (సోమవారం) విచారణకు హాజరు కావాలని పేర్కొంది. కేజ్రీవాల్​కు ఈడీ ఇంతకుముందు ఐదు సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఏ ఒక్క సమన్లకూ ఆయన స్పందించలేదు. విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈడీ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. 

పిటిషన్ విచారించిన కోర్టు.. వచ్చే శనివారం కోర్టు కు హాజరు కావాలని కేజ్రీవాల్​ను ఆదేశిం చింది. గతంలో జారీ చేసిన ఐదు సమన్లకు ఎందుకు స్పందించలేదో తెలపాలని సూచించింది. ఈ లోపే ఈడీ ఆరోసారి సమన్లు జారీ చేసింది. కాగా.. లోక్‌‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ కేజ్రీవాల్‌‌ను లక్ష్యంగా చేసుకుంటోందని ఆమ్ ​ఆద్మీ పార్టీ నేతలు ఆరోపించారు. శనివారం హాజరు కావాలన్న కోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.