ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్తో సీఎం కేజ్రీవాల్ భేటీ

ఢిల్లీ లెఫ్ట్నెంట్ గవర్నర్తో సీఎం కేజ్రీవాల్ భేటీ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ లెఫ్ట్నెంట్ గవర్నర్ వీకే సక్సేనాతో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియాపై సీబీఐ దాడులు జరిపిన తర్వాత వీరు భేటీకావడం ఇదే తొలిసారి. పరిపాలనలో భాగంగానే ఈ సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. 

ఆప్ సర్కార్ తెచ్చిన లిక్కర్ పాలసీని తీవ్రంగా వ్యతిరేకించిన గవర్నర్.. సీబీఐ దర్యాప్తుకు ఆదేశించారు. దాంతో ఆప్ ప్రభుత్వం - లెఫ్ట్నెంట్ గవర్నర్కు మధ్య గ్యాప్ వచ్చింది. లెఫ్ట్నెంట్ గవర్నర్ ద్వారా ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా కేజ్రీవాల్ సర్కార్ను గద్దెదించాలనే కుట్రలకు పాల్పడ్డారని ఆప్ ఆరోపించింది. నోట్ల రద్దు సమయంలో ఖాదీ ఇండస్ట్రీస్ చైర్మన్గా ఉన్న వీకే సక్సేనా అవినీతికి పాల్పడ్డారని ఆప్ నేతలు ఆరోపించారు. 1400 కోట్ల పాతనోట్లను కొత్త నోట్లుగా మార్చారన్నారు. దీంతో ఆప్ నేతలకు గవర్నర్ లీగల్ నోటీసులు పంపించారు.