కేజ్రీవాల్​ పర్సనల్ సెక్రటరీపై వేటు .. క్రిమినల్ కేసు ఉందన్న కారణంతో తొలగింపు

కేజ్రీవాల్​ పర్సనల్ సెక్రటరీపై వేటు .. క్రిమినల్ కేసు ఉందన్న కారణంతో తొలగింపు

న్యూఢిల్లీ:  ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీపై వేటు పడింది. నియామకం టైంలో రూల్స్ ఉల్లంఘించారనే ఆరోపణలతో కేజ్రీవాల్ ప్రైవేట్ కార్యదర్శి బిభవ్ కుమార్​ను విజిలెన్స్ అధికారులు గురువారం తొలగించారు. తాత్కాలిక నియామకాలకు సంబంధించిన కేంద్ర సివిల్ సర్వీస్ రూల్స్​ను ఉల్లంఘించి బిభవ్​ను నియమించారని విజిలెన్స్ డైరెక్టరేట్ ఉత్తర్వుల్లో పేర్కొంది. 

డ్యూటీలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు బిభవ్​పై 2007లో నోయిడాలో క్రిమినల్ కేసు నమోదైంది. ఈ విషయాన్ని నియామక సమయంలో వెల్లడించలేదనే కారణంతో తొలగిస్తున్నట్లు తెలిపింది. కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిభవ్​ను ఈడీ అధికారులు గత సోమవారమే విచారించి, స్టేట్​మెంట్​ను రికార్డ్ చేశారు. అయితే, బిభవ్ కుమార్​ను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు మండిపడ్డారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం నిర్వీర్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.