సిసోడియా బీజేపీలో చేరితో కేసులుండవు.. కదా!: కేజ్రీవాల్

సిసోడియా బీజేపీలో చేరితో కేసులుండవు.. కదా!: కేజ్రీవాల్

ఆప్ సర్కారుపై బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎలాంటి తప్పు జరగలేదన్నారు. మనీశ్ సిసోడియా విద్యారంగంలో, వైద్యరంగంలో సత్యేంద్ర జైన్ మంచి పనులు చేయడంతోనే వారిద్దరిని అరెస్ట్ చేశారని ఆరోపించారు.  సిసోడియా బీజేపీలో చేరితో ఆయన విడుదలవుతారని..బీజేపీ చేరితే ఎన్ని కేసులున్నా ఉపసంహరించుకుంటారని ఎద్దేవా చేశారు. 

ఇందిరాగాంధీ లెక్కనే చేస్తున్నరు

గతంలో ఇందిరా గాంధీ ప్రతిపక్షాలపై వ్యవహరించినట్లే ప్రస్తుతం ప్రధాని మోడీ ప్రతిపక్షాలను అణిచివేస్తున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ప్రజలకు మంచి జరగాలని ప్రధాని కోరుకోవడం లేదని.. అందుకే  మంత్రులు మనీష్ సిసోడియా,సత్యేందర్ జైన్‌లను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. అవినీతిని ఆపడం  బీజేపీ ప్రభుత్వ  ఉద్దేశ్యం కాదని..,ఢిల్లీలో  జరుగుతున్న మంచి పనిని ఆపడం వారి ఉద్దేశమని  దుయ్యబట్టారు. 

పంజాబ్లో గెలిస్తే తట్టుకోలేకపోతున్నరు

పంజాబ్లో ఆప్ గెలిచిన తర్వాత బీజేపీ తట్టుకోలేకపోతోందని కేజ్రీవాల్ తెలిపారు. అందుకే ఆప్ ను అడ్డుకునేందుకు బీజేపీ అనేక ప్రయత్నాలు చేస్తోందని..ఆప్ ను ఎవరు అడ్డుకోలేరన్నారు.  సిసోడియాఅరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఇంటింటి ప్రచారం చేస్తుందన్నారు.