
అకాళీదల్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ కు ప్రతి వారం కేజ్రీవాల్ మద్యం పెట్టెను పంపుతారని ఆరోపించారు. దీంతో ముఖ్యమంత్రి భగవత్ మాన్ ఎంజాయ్ చేస్తూ.. కూర్చోని పంజాబ్ లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారని తెలిపారు. ఆప్ ప్రభుత్వం వల్లనే పంజాబీ గాయకుడు,కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యాడని ఆరోపించారు. సిద్ధూకి కల్పించిన భద్రతను ఉపసంహరించుకోవడంతో శత్రువులకు అవకాశం కల్పించినట్టు అయ్యిందన్నారు. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా భద్రతను ఉపసంహరించుకోవాలని సూచించారు.