
టెన్నిస్ టాప్ స్టార్స్ అరినా సబలెంకా, కోకో గౌఫ్ వింబుల్డన్ సెంటర్ కోర్ట్ లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోవచ్చు. ఈ నెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో సబలెంకా, కోకో గౌఫ్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఫైనల్లో సబలంక ప్రత్యర్థి కోకో గౌఫ్ ను తక్కువగా అంచనా వేసింది. మ్యాచ్ లో తప్పకుండా గెలుస్తుందన్న ఆమెకు గౌఫ్ ఊహించని షాక్ ఇచ్చింది. 7-6, 2-6, 4-6 తేడాతో సబలంక ఓడిపోయింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇద్దరికీ శత్రుత్వం పెరిగింది. ఒకరినొకరు దూషించుకున్నారు. అయితే ఇదంతా అప్పుడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసిపోయారు.
గొడవలు మ్యాచ్ వరకే వ్యక్తిగతంగా కాదు అని నిరూపిస్తూ ఒకటయ్యారు. వింబుల్డన్ సెంటర్ కోర్ట్ లో టిక్ టాక్ డ్యాన్స్ చేస్తూ కనిపించారు. సోమవారం (జూన్ 30) నుంచి వింబుల్డన్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి ముందు నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న సబలెంకా, నంబర్ 2 ర్యాంక్‌లో ఉన్న గౌఫ్ కు మధ్య సెంటర్ కోర్టులో కలిసి ప్రాక్టీస్ సెషన్ నిర్వహించారు. ఈ మ్యాచ్ తర్వాత సరదాగా డ్యాన్స్ చేసి తాము స్నేహితులయ్యాం అని చెప్పకనే చెప్పారు. వీరి డ్యాన్స్ ను గౌఫ్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ " హలో అబ్బాయిలు, మేము వచ్చేశాం.. మమ్మల్ని మీరు మిస్సయ్యారా.. అనే క్యాప్షన్ ఇచ్చింది". ప్రస్తుతం వీరు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : 238 పరుగుల టార్గెట్ ఖతం: చివరి బంతికి 6 పరుగులు
ఇక వింబుల్డన్ సీడింగ్స్ విషయానికి వస్తే టాప్ సీడ్ గా అరినా సబలెంకా, రెండో సీడ్ గా కోకో గౌఫ్ బరిలోకి దిగుతుంది. వీరిద్దరూ స్థాయికి తగ్గట్టుగా ఆడితే జూలై 12 న వింబుల్డన్ ఫైనల్లో మరోసారి వీరి మ్యాచ్ ఎంజాయ్ చేయొచ్చు. బెలారస్‌కు చెందిన 27 ఏళ్ల సబలెంకా మూడుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు గౌఫ్ 2 గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్స్ ను గెలుచుకుంది.
Aryna Sabalenka and Coco Gauff filming a Tik Tok ahead of Wimbledon.
— The Tennis Letter (@TheTennisLetter) June 27, 2025
They’re so unserious 😭😭😭
pic.twitter.com/Hggu4etEqW