
అలంపూర్, వెలుగు: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ అమ్మవారికి నవదుర్గ అలంకారంతో పూజ నిర్వహించారు. మూడవ రోజు అమ్మవారు చంద్రఘంటాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
హైదరాబాద్ కు చెందిన తీగల క్రాంతి రెడ్డి, లక్ష్మీస్రవంతి దంపతులు జోగులాంబ అమ్మవారికి రూ.55 లక్షలు విలువ చేసే బంగారు పూతతో కూడిన మకరతోరణం, పీఠం తొడుగును బహూకరించారు. అలాగే హైదరాబాద్ కు చెందిన మహేశ్ కుమార్ రెడ్డి, రాధిక రెడ్డి దంపతులు ఆలయానికి రూ. లక్ష విరాళాన్ని అందజేశారు. ఆలయ ఈవో దీప్తి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.