
అమిగోస్. నా సామిరంగా చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. తాజాగా మరో చిత్రం ఆమె కెరీర్ డైరీలో చేరింది. కార్తి హీరోగా తెరకెక్కుతున్న ‘సర్దార్ 2’లో ఆమె అవకాశం అందుకుంది. పి.ఎస్.మిత్రన్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రిన్స్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.
ఇందులో మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్‌గా నటిస్తుండగా ఎస్.జె.సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఆషికా కూడా ఇందులో నటించబోతోందని ప్రకటించారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ ఈ ప్రాజెక్ట్‌లోకి వెల్ కమ్ చెప్పారు మేకర్స్. ఇక ప్రస్తుతం తెలుగులో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’లో కూడా ఆషిక నటిస్తోంది.