నాగార్జున నుంచి రాబోతున్న చిత్రం ‘కింగ్ 100’. తమిళ దర్శకుడు రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఆయన కెరీర్‌లో ఇది 100వ సినిమా. ఇటీవల మహంతి ఝాన్సీ రాణిగా టబును పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో పరిచయం చేసిన మేకర్స్.. తాజాగా తమిళ నటుడు అశోక్ సెల్వన్ పోషిస్తున్న ‘కర్ణ’ పాత్రను రివీల్ చేశారు.
తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్‌లో స్టైలిష్‌గా కనిపించాడు అశోక్ సెల్వన్. తన కుర్చీపై త్రీ స్టార్స్ ఉన్న పోలీస్ యూనిఫామ్ ఉండటం, తన క్యారెక్టర్‌లోని వైల్డ్‌నెస్‌ను ప్రజెంట్ చేసిన తీరును బట్టి నెగెటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించినట్టు తెలుస్తోంది. మునుపెన్నడూ చూడని సరికొత్త క్యారెక్టర్‌లో తనను చూపించబోతున్నట్టు మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రాజా మహదేవన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
