
అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని గుర్రాల చెరువు గ్రామ శివారులో స్వయంభూగా వెలసిన కనకదుర్గమ్మకు శుక్రవారం పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్డు షిర్డీ సాయి మందిరం నుంచి చీర, సారే, పసుపు, కుంకుమ 108 రకాల నైవేద్యాలను తెచ్చి సమర్పించారు.
సాయిబాబా మందిరం నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు ఐదు కిలోమీటర్లు పాదయాత్రగా వెళ్లిన మహిళలు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో మందిరం నుంచి అమ్మవారికి నైవేద్యాలు, చీర,సారెను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని షిర్డీ సాయి సేవా సమితి అధ్యక్షుడు పంబి హరి, తిరుమల శెట్టి అప్పారావు తెలిపారు. కనకదుర్గమ్మ కు 108 రకాల స్వీట్స్ నైవేద్యంగా సమర్పించిన భక్తులు