అశ్విన్ బాబు కొత్త చిత్రం షురూ

అశ్విన్ బాబు కొత్త చిత్రం షురూ

అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ జంటగా ఓ చిత్రం రూపొందుతోంది. ‘గంధర్వ’ ఫేమ్ అప్సర్‌‌‌‌ దర్శకత్వంలో మూలి మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. సోమవారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుబ్బు కెమెరా స్విచాన్ చేయగా, మరో దర్శకుడు విజయ్ కనకమేడల క్లాప్ ఇచ్చాడు. 

ఫస్ట్ షాట్‌‌కు ‘బింబిసార’ దర్శకుడు వశిష్ట గౌరవ దర్శకత్వం వహించాడు. దర్శకనిర్మాత ఓంకార్ స్క్రిప్ట్‌‌ను టీమ్‌‌కు అందజేశాడు.నిర్మాతలు సుధాకర్ రెడ్డి, ‘ఠాగూర్’ మధు, శిరీష్ రెడ్డి, ఎర్రబెల్లి విజయ్ కుమార్ రావు అతిథులుగా హాజరయ్యారు. అనంతరం చిత్ర నిర్మాత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ‘కొత్త తరహా కథ, కథనాలతో తెరకెక్కుతున్న న్యూ ఏజ్ సినిమా ఇది. నిన్నటి నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌‌లో జరుపుతున్నాం’ అని చెప్పారు.