
ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్ లో భారత్ - పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ బౌలింగ్ ఎంచుకుని భారత్ కు బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గ్రూప్ దశలో పాక్ పై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పాక్ ఉవ్విళ్లూరుతోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చారు. భారత్ - పాక్ జట్లు తలపడడం ఒకే టోర్నమెంట్ లో రెండోసారి తలపడడం గమనార్హం. అభిమానులు ఈ మ్యాచ్ ను తిలకించడానికి టీవీల ఎదుట అతుక్కపోయారు. భారత్ లో కీలకమైన ఆటగాడైన రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్థానంలో రవి బిష్ణోయ్ కి స్థానం కల్పించారు. సీనియర్ బ్యాట్స్ మెన్ దినేశ్ కార్తిక్ ప్లేస్ లో దీపక్ హుడాకు అవకాశం ఇచ్చారు.
ఇండియా : రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, పంత్ (కీపర్), దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, అక్షర్, భువనేశ్వర్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్, చహల్.
పాకిస్తాన్ : రిజ్వాన్ (కీపర్), బాబర్ (కెప్టెన్), జమాన్, ఇఫ్తికర్, కుష్దిల్ ఫా, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ ఆలీ, మహ్మద్ నవాజ్, హరీష్ రవూఫ్, మహ్మద్ హసన్, నసీం షా