జపాన్‌‌‌‌‌‌‌‌లో కలుద్దాం.. ముగిసిన ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌

జపాన్‌‌‌‌‌‌‌‌లో కలుద్దాం.. ముగిసిన ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌

హాంగ్జౌ: రెండు వారాల పాటు అలరించి ఇండియాకు పతకాల పంట పండించిన ఆసియాగేమ్స్‌‌‌‌‌‌‌‌ ఆదివారం ముగిశాయి. బిగ్‌‌‌‌‌‌‌‌ లోటస్‌‌‌‌‌‌‌‌ స్టేడియంలో 75 నిమిషాల పాటు జరిగిన కలర్‌‌‌‌‌‌‌‌ ఫుల్‌‌‌‌‌‌‌‌ క్లోజింగ్‌‌‌‌‌‌‌‌ సెర్మనీ ఫ్యాన్స్​ను కట్టి పడేసింది. కండ్లు మిరుమిట్లు గొలిపే లేజర్‌‌‌‌‌‌‌‌ షో, ప్రఖ్యాత పాప్‌‌‌‌‌‌‌‌ సౌండ్స్‌‌‌‌‌‌‌‌, అత్యద్భుతమైన లైటింగ్‌‌‌‌‌‌‌‌ మధ్య చైనా సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా చేసిన నృత్యాలు అదరహో అనిపించాయి. డిజిటల్‌‌‌‌‌‌‌‌ టర్ఫ్‌‌‌‌‌‌‌‌పై ‘ఆసియా’ అని ప్రత్యేకంగా రాసిన అక్షరాలతో పెద్ద కటౌట్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు.

చైనా ప్రీమియర్‌‌‌‌‌‌‌‌ లీ కియాంగ్‌‌‌‌‌‌‌‌, ఇతర ప్రముఖుల సమక్షంలో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఆసియా (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు రణ్‌‌‌‌‌‌‌‌ధీర్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌.. 19వ ఆసియా గేమ్స్‌‌‌‌‌‌‌‌ ముగిసినట్లు ప్రకటించారు. తర్వాతి గేమ్స్‌‌‌‌‌‌‌‌ కోసం ఐచి–నాగోయా (జపాన్‌‌‌‌‌‌‌‌)లో కలుసుకుందామని పిలుపునిచ్చారు. గేమ్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన టార్చ్‌‌‌‌‌‌‌‌ను జపాన్‌‌‌‌‌‌‌‌ ప్రతినిధులకు అందజేశారు. హాకీ స్టార్​ పీఆర్‌‌‌‌‌‌‌‌ శ్రీజేష్‌‌‌‌‌‌‌‌ ఇండియా ఫ్లాగ్​ బేరర్​గా వ్యవహరించాడు. దాదాపు మంది ఇండియా అథ్లెట్లు, అధికారులు సెర్మనీలో పాల్గొన్నారు. ఈ గేమ్స్​లో చైనా 383 మెడల్స్​తో అగ్రస్థానం కైవసం చేసుకోగా.. ఇండియా 107 పతకాలతో నాలుగో స్థానం  సాధించింది.