
యెంచియోన్ (సౌత్ కొరియా): ఆసియా అండర్20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చివరి రోజును ఇండియా రెండు గోల్డ్ మెడల్స్‌తో ముగించింది. బుధవారం జరిగిన పోటీల్లో విమెన్స్ 4x400 మీ రిలే టీమ్‌తో పాటు 1500 మీ. రన్నర్ లక్సిత వినోద్ సాండిలా గోల్డ్ మెడల్ సాధించింది. సాండియా 4:24.23 సెకండ్లతో తన పర్సనల్ బెస్ట్ టైమింగ్ నమోదు చేస్తూ బంగారు పతకం సొంతం చేసుకుంది. మరోవైపు క్వార్టర్ మైలర్ మల్లిక్ హీనా సత్తా చాటడంతో విమెన్స్ రిలే టీమ్ (3:40.49సె) టాప్ ప్లేస్ సాధించింది. మెహ్దీ హసన్ (మెన్స్ 1500 మీ), శివాజి (5000 మీ.) సిల్వర్ మెడల్స్ నెగ్గారు. ఈ టోర్నీలో ఇండియా మొత్తంగా 6 గోల్డ్ సహా 19 మెడల్స్ సాధించింది.