విద్యతోనే గిరిజన అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

విద్యతోనే గిరిజన అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

​​​​తిర్యాణి, వెలుగు : విద్యతోనే ఆదివాసీ గిరిజనుల నిజమైన అభివృద్ధి సాధ్యమని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదివారం మండలంలోని ఎదులపహాడ్ లో వెడ్మ రాము 38వ వర్ధంతిని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యేలు వెడ్మ రాము విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ కోసం కుమురం భీంతో కలిసి వెడ్మ రాము చేసిన పోరాటం మరువలేనిదని, ఆయన ఆలోచనలు, త్యాగం గిరిజన సమాజానికి ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు.

 ఎదులపహాడ్‌లో వెడ్మ రాము నిలువెత్తు విగ్రహం, స్మృతివనం రోడ్డు, మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సంఘ నాయకులు పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేలకు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాంగ్రెస్ జిల్లా నాయకులు జువ్వాజీ అనిల్ గౌడ్, డీటీడీవో రమాదేవి, ఏటీడబ్ల్యో చిరంజీవి, జీసీడీవో శంకుంతల, డీఎస్వో మాడవి షేకు, ఎస్సై వెంకటేశ్, పీవీటీజీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు చహకటి దశ్రు, రాష్ట్ర అధ్యక్షుడు ఆత్రం భీంరావు తదితరులు పాల్గొన్నారు.