‘విజన్-2030’లో ఆసిఫాబాద్కు గుర్తింపు..ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్

‘విజన్-2030’లో ఆసిఫాబాద్కు గుర్తింపు..ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్
  •      లింబుగూడ బహుళార్థక ప్రయోజన కేంద్రం సేవలపై ప్రజెంటేషన్​

ఆసిఫాబాద్, వెలుగు: గిరిజన గ్రామాల అభివృద్ధి కోసం విజన్–2030 కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయడంలో జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. శుక్రవారం ఢిల్లీలో గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆది కర్మయోగి అభియాన్ పై నిర్వహించిన జాతీయ సదస్సుకు కలెక్టర్​వెంకటేశ్ ధోత్రే హాజరయ్యారు. వాంకిడి మండలం కిరిడి గ్రామ పంచాయతీ పరిధిలోని లింబుగూడ బహుళార్థక ప్రయోజన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

 500కు పైనే గిరిజన కుటుంబాలకు విద్య, వైద్యం, పౌష్టికాహారం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన అందిస్తున్నామని, గిరిజనులు ఉపాధి పొందేందుకు అవసరమైన శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా చిత్రాలను రూపొందించడం, సంప్రదాయ కళలు, గుస్సాడీ నృత్యం ప్రదర్శించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.  జైనూర్ ఏటీడీవో శ్రీనివాస్, మిషన్ భగీరథ ఏఈ రంజిత్ తదితరులు పాల్గొన్నారు.