
- ప్రభుత్వం దీర్ఘకాలిక సహాయక చర్యలు చేపట్టాలి
- అస్మిక కేర్ గివర్ సంఘం విజ్ఞప్తి
ముషీరాబాద్, వెలుగు: మానసిక రోగుల సంరక్షకుల పట్ల నిర్లక్ష్యం తగదని, ప్రభుత్వం దీర్ఘకాలిక సహాయక చర్యలు చేపట్టాలని అస్మిక కేర్ గివర్ సంఘం విజ్ఞప్తి చేసింది. శనివారం ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో అస్మిక కేర్ గివర్ సంఘం ఆధ్వర్యంలో మానసిక రోగుల సంరక్షకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగుల సర్టిఫికెట్, యూడీఐడీ జారీ ప్రక్రియను సరళీకరించాలని, 108 అంబులెన్స్‌లలో కొన్నింటిని మానసిక రోగుల కోసం 108 ఎంగా మార్చి, శిక్షణ పొందిన సిబ్బందితో సురక్షిత తరలింపు సౌకర్యం కల్పించాలని కోరారు.
ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా కవరేజీని నిరాకరించడం, క్లైమ్లపై నిర్లక్ష్యం చూపడం, మానసిక రోగులపై వివక్ష చూపుతున్నాయని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రెసిడెంట్ రామ్మోహన్ రావు, కె. సుజావతి, డా. నిర్మల, జయానంద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.x