ఈసీ కీలక నిర్ణయం.. రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

ఈసీ కీలక నిర్ణయం..  రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికల తేదీ మార్పు

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ లో అసెంబ్లీ ఎన్నికల తేదీని  మార్చి్ంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 23న ఎన్నికలు జరగాల్సి ఉండగా,  ఆ రోజున రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయని అన్ని పార్టీలు ఈసీకి లేఖ రాశాయి. 

ఈ కారణంగా సుమారు 25 లక్షల మంది పోలింగ్‌కు దూరం అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలిపాయి.  ఈ క్రమంలో ఎన్నికల తేదీన 2023  నవంబర్ 25న  నిర్వహిస్తామని  ఈసీ  అధికారిక ప్రకటన విడుదల చేసింది.   ఇక  డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. 

కాగా తెలంగాణతో పాటు ఐదు రాష్ట్రాలకు  అక్టోబర్‌ 9న  కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

రాజస్థాన్ ఎన్నికల 2023 షెడ్యూల్

  • గెజిట్ నోటిఫికేషన్ జారీ తేదీ: అక్టోబర్ 30
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: నవంబర్ 6
  • అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ పోల్ తేదీ: నవంబర్ 9
  • పోలింగ్ తేదీ: నవంబర్ 25
  • కౌంటింగ్ తేదీ: డిసెంబర్ 3