
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర 'అసెంబ్లీ మీడియా సలహా మండలి కమిటీ'ని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ సెక్రటరీ నరసింహచార్యులు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు అమల్లో ఉండనున్న ఈ కమిటీలో.. 15 మంది జర్నలిస్టులకు చోటు కల్పించారు. దీనికి చైర్మన్ గా సీనియర్ జర్నలిస్టు, ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ పొలిటికల్ ఎడిటర్ ఐరెడ్డి శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
కో చైర్మన్ గా పోలోజు పరిపూర్ణాచారి (ఎన్టీవీ) , సభ్యులుగా సీనియర్ జర్నలిస్టులు బుర్ర ఆంజనేయులు గౌడ్ (వీ6 వెలుగు) , అయితరాజు రంగారావు (ఈనాడు), బొడ్లపాటి పూర్ణచంద్రారావు(ఆంధ్రజ్యోతి), ఎల్ .వెంకట్రాం రెడ్డి (దక్కన్ క్రానికల్) , పొలంపల్లి ఆంజనేయులు (సాక్షి) , ఎం. పవన్ కుమార్ (బిగ్ టీవీ), భీమనపల్లి అశోక్ (టీవీ9), సురేఖ అబ్బూరి (ఇండియా టీవీ), మహమ్మద్ నయీమ్ వజాహత్ (సియాసత్ డైలీ), బసవ పున్నయ్య (నవ తెలంగాణ), ప్రమోద్ కుమార్ చతుర్వేది (ఏఎన్ఏ), సుంచు అశోక్ (విజయక్రాంతి) , బీహెచ్ఎంకే గాంధీ (దక్కన్ క్రానికల్) నియమితులయ్యారు.