ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలి: గడ్డం ప్రసాద్

ప్రతి ఒక్కరూ ప్రేమతో మెలగాలి: గడ్డం ప్రసాద్

వికారాబాద్, వెలుగు :  రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని చిగుళ్లపల్లి గ్రౌండ్ లో ఇఫ్తార్ విందును  మహబూబ్ ఆలంఖాన్ ఏర్పాటు చేయగా.. స్పీకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదరులపై అల్లా దీవెనలు ఉంటాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇతరులతో ప్రేమతో మెలగాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్ పార్టీ అని, మైనార్టీలను కాపాడుకునే పార్టీ గుర్తు చేశారు.

కాంగ్రెస్ చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఓటు వేసి భారీ మెజార్టీ ఇవ్వాలని, కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.  కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్, ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.