శుక్లా పేరెంట్స్ భావోద్వేగం

శుక్లా పేరెంట్స్ భావోద్వేగం

న్యూఢిల్లీ: శుక్లా చదువుకున్న లక్నోలోని సిటీ మాంటిస్సోరీ స్కూల్​లో నిర్వహించిన వాచ్ పార్టీలో ఆయన తల్లిదండ్రులు పాల్గొని, ప్రయోగాన్ని వీక్షించారు. శుభాంశు తల్లి ఆశా శుక్లా.. కన్నీళ్లతో పెద్ద స్క్రీన్‌‌‌‌‌‌‌‌ వైపు రెప్పవేయకుండా చూస్తూ రెండు చేతులు జోడించి ప్రార్థించారు. శుభాంశు తండ్రి శంభు దయాళ్ శుక్లా.. చిరునవ్వు నవ్వుతూనే భావోద్వేగానికి గురయ్యారు. 

స్పేస్‌‌‌‌‌‌‌‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ లిఫ్టాఫ్ తర్వాత.. ఆశా శుక్లా మీడియాతో నవ్వుతూ మాట్లాడారు. “మాకు గర్వంగా ఉంది. శుభాంశు, రాకేశ్ శర్మ తర్వాత రెండో భారతీయుడిగా అంతరిక్షంలోకి వెళ్లాడు. భయం లేదు. మిషన్ పూర్తి చేయమని చెప్పాం” అని తెలిపారు. 

శుక్లా సోదరి కూడా సంతోషం, గర్వంతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రయాణానికి ముందు శుభాంశు కూడా తన ఫ్యామిలీకి ఓ స్పెషల్ మెసేజ్ పంపారు. “నా కోసం వేచి ఉండండి, నేను తప్పక వస్తాను” అని ధైర్యం చెప్పారు. వీడియో కాల్‌‌‌‌‌‌‌‌లో తల్లిదండ్రులతో మాట్లాడారు.