కారేపల్లి, వెలుగు : ఆడపడుచులు ఒకరికొకరు వాయనం ఇచ్చి పుచ్చుకునే అట్లతద్ది పండుగను మండలంలోని విశ్వనాథపల్లిలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అట్లు నైవేద్యంగా సమర్పించి గౌరీ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించే కార్యక్రమాన్ని మహిళలు వైభవంగా చేపట్టారు.
చెట్లకు ఉయ్యాల ను కట్టి ఉయ్యాల పండుగను ఉత్సాహకంగా జరుపుకొన్నారు.