భూమి నుంచి శాటిలైట్లపై దాడి

భూమి నుంచి శాటిలైట్లపై దాడి

శత్రువులకు ముచ్చెమటలు పట్టించే మూడు ఆయుధాల తయారీలో చైనా గొప్ప ముందడుగు వేసింది. శత్రు దేశాల ఉపగ్రహాలను నాశనం చేసే లేదా పని చేయకుండా చేసే డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్(డీఈడబ్ల్ యూ), మొబైల్ పల్స్  నరేటర్స్(ఎంపీజీ), ప్రస్తుతం ఉన్న ఆయుధాలను మరింత శక్తిమంతం చేసే ఎలక్ట్రోమాగ్నటిక్ పల్సె స్(ఈఎంపీ) అనే మూడు టెక్నాలజీల తయారీలో దూసుకు పోతోంది. వీటి శక్తి ఊహలకూ అందదని నిపుణులు అంటున్నారు. అమెరికా కూడా ఇలాంటి ఆయుధాల తయారీలో నిమగ్నమైంది. అమెరికా లాంటి బేస్‌‌‌‌‌‌‌‌లే చైనాలోనూ ఉన్నట్లు ఓపెన్ సోర్స్ శాటిలైట్స్ ఫొటోల్లో కనిపించాయి.

డెరెక్ట్ ఎనర్జీ వెపన్స్

శాటిలైట్స్ ట్రాకిం గ్‌ లో చైనా చాలా ముందుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ట్రాకింగ్ సెంటర్లున్నా యి. వీటిలో టిబెట్‌ లోని ఎన్గరి ఒకటి. టార్గెట్ చేయడానికి ఏ శాటిలైట్ ఎక్కడుందో ఈ సెంటర్ సమాచారం ఇస్తుంది. ఆ తర్వాతి పనిని డీఈడబ్ల్ యూ చూసుకుంటుంది. చైనాలో మొత్తం ఐదు డీఈడబ్ల్ యూ సెంటర్లు ఉన్నాయి. వీటిలో జిన్జియాం గ్‌ లో ని బేస్ ఒకటి. ఇక్కడ నాలుగు ప్రధాన బిల్డింగులను కట్టారు. వీటి సైజును బట్టి కెమికల్ లేజర్లు, నియోడిమియం లోహాలను ఆయుధాల్లో వాడుతున్నట్లు నిపుణులు చెబుతున్నా రు. నాశనం చేయాలంటే ఎక్కు వ శక్తిని, పని చేయకుండా ఉండాలంటే తక్కు వ శక్తి లేజర్లను వాడతారు.

ఎలక్ట్రో మాగ్నటిక్ పల్సెస్

భారీ పర్వతానికి పెద్ద కలుగు. లోపల పెద్ద పెద్ద స్థంభాలు. వాటిపై ఈఎంపీ పరికరాలు. అతి శక్తిమంతమైన పల్సెస్‌‌‌‌‌‌‌‌తో ఆయుధాలపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఇక్కడి అవసరాలు తీర్చేందుకు లోపలికి  తరచుగా మిలటరీ వాహనాలు వచ్చి వెళ్తున్నాయి. ఇది జిన్ జియాంగ్ పర్వతాల్లో శాటిలైట్ గమనించింది. అచ్చూ ఇలాంటి తరహా బేసే అమెరికాలోని మేరిల్యాండ్ నావల్ ఎయిర్ స్టేషన్ లో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆయుధాలను ఇంకా శక్తిమంతగా చేసేందుకు పరీక్షలు జరుగుతుం టాయని నిపుణులు చెబుతున్నా రు. ఇక, శాటిలైట్లను క్షణాల్లో పని చేయకుండా చేయగల సత్తా ఉన్న ఎంపీజీని కూడా చైనా జిన్జియాం గ్‌ లో నే కట్టింది. ఇవి నాన్ న్యూక్లియర్ పల్స్ జనరేటర్స్. ఎలక్ట్రోమాగ్నటిక్ రంగాలను సృష్టిస్తూ ఉపగ్రహాలను పనిచేయకుండా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.