మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ 50శాతం కూడా హాజరైతలే

మెడికల్ కాలేజీల్లో ఫ్యాకల్టీ 50శాతం కూడా హాజరైతలే
  • దేశంలోని అన్ని కాలేజీల్లోనూ ఇదే పరిస్థితి: ఎన్ఎంసీ రిపోర్టు

న్యూఢిల్లీ:మెడికల్ కాలేజీల్లో టీచింగ్ ఫ్యాకల్టీ అటెండెన్స్ తగ్గిపోయింది. 2022-–23 ఏడాదిలో హాజరు 50 శాతం కంటే తక్కువగానే ఉంది. దేశంలోని ఏ మెడికల్ కాలేజీలోనూ ఫ్యాకల్టీ హాజరు 50శాతానికి చేరుకోలేదని నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) తెలిపింది. మెజారిటీ మెడికల్ కాలేజీల్లో సీనియర్ రెసిడెంట్లు, ఘోస్ట్ డాక్టర్లే ఉంటున్నారని కనుగొంది. 

కాగా, ఇటీవల నోటిఫై చేసిన రెగ్యులేషన్‌‌లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అత్యవసర విభాగం అవసరాన్ని ఎన్​ఎంసీ మినహాయించింది. అంతకుముందు ప్రతీ మెడికల్ కాలేజీలోని 14 డిపార్ట్​మెంట్లలో అత్యవసర మెడిసిన్​ విభాగం తప్పనిసరిగా ఉండేది. 

అలాంటి 134 కాలేజీల్లో 2020లో చేసిన సర్వే ప్రకారం.. దాదాపుగా అన్ని కాలేజీలు అటెండెన్స్​లో ఫెయిల్​ అయ్యాయని ఎన్​ఎంసీకి చెందిన అండర్ గ్యాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు తేల్చింది.