అన్ని లెక్కలు తేలాకే రాజీనామా చేయాలి : అత్తు ఇమామ్

అన్ని లెక్కలు తేలాకే రాజీనామా చేయాలి : అత్తు ఇమామ్

సిద్ధిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులు అన్ని లెక్కలు తేలాకే రాజీనామా చేయాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు చెందిన నాయకులు పనులు పూర్తి చేయనప్పటికీ అయినట్లుగా లెక్కలు చూపించి తారుమారు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు ఆపాలని పనులు పూర్తయితే తప్ప ఒక్క పైసా కూడా చెల్లించవద్దన్నారు. బిల్లుల అవకతవకలపై సీఎం రేవంత్​రెడ్డికి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గయాజుద్దీన్, రాశాద్. ఇస్మాయిల్, నజ్జు ఫయాజ్ పాల్గొన్నారు.