
పూల జాతరకు వేళైంది. ఆదివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఊరూరా మహిళలు వేడుకల్లో పాల్గొంటున్నారు. పెత్తరమాస ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ సందడి ఇక సద్దుల బతుకమ్మ దాకా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో సందడి నెలకొననున్నది. ‘బతుకమ్మ .. బతుకమ్మ ఉయ్యాలో’.. అంటూ ఉయ్యాల పాటలతో ఉత్సాహం నిండింది. ఆడబిడ్డల ఆటపాటలతో తెలంగాణ మార్మోగుతోంది.
ఆశ్వయుజ మాసంలో తొలి రోజైన పాడ్యమి నాడు జరుపుకొనే బతుకమ్మను 'అటుకుల బతుకమ్మ' అని పిలుస్తారు. తీరొక్క పూలను రెండు ఎత్తులలో బతుకమ్మను పేర్చి, ఆడవారు అందరూ కలసి ఆడుకొని సాయంత్రం చెరువులలో నిమజ్జనం చేస్తారు. ఈ రోజున అమ్మకు ఎంతో ఇష్టమైన చప్పిడిపప్పు, బెల్లలం , అటుకులు.. వంటి పదార్థాలను నైవేద్యయంగా సమర్పిస్తారు.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ పాట లిరిక్స్:
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ..
తంగేడు కాయొప్పునే గౌరమ్మ
తంగేడు చెట్టు కింద ఆట
సిల్మాలారా పాట సిల్కాలారా
కల్కి సిల్మాలార కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
తీరు రుద్రాక్షలు తారు గోరింటలు...
ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ..
గజ్జల ఒడ్డానమే గౌరమ్మ.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ
గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ
గుమ్మడి చెట్టు కింద ఆట
సిల్కాలారా పాట నిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు
తీరు రుద్రాక్షలు తారు గోరింటలు
ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ.
గజ్జల ఒడ్డానమే గౌరమ్మ.
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ
రుద్రాక్ష చెట్టు కింద ఆట
సిల్కాలారా పాట సిల్కాలారా
కల్కి సిల్కాలారా కందుమ్మ
గుడ్డలు రానువోను అడుగులు
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
కాకర పువ్వొప్పునే గౌరమ్మ
కాకర కాయొప్పునే గౌరమ్మ
కాకర చెట్టు కింద ఆట సిల్కాలారా పాట
సిల్మాలారా కల్కి సిల్మాలారా
కందుమ్మ గుడ్డలు రానువోను
అడుగులు తీరు ఉద్రాక్షలు తారు గోరంటలు
ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ..
గజ్జల ఒడ్డానమే గౌరమ్మ..
ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ
ఏమేమి కాయొప్పునే గౌరమ్మ
చామంతి పువ్వొప్పునే గౌరమ్మ
చామంతి కాయొప్పునే గౌరమ్మ
చామంతి చెట్టు కింద ఆట
సిల్కాలార పాట సిల్కాలార కల్కి సిల్కాలార
కందుమ్మ గుడ్డలు రానువోను
అడుగులుతీరు ఉద్రాక్షలు
తారు గోరంటలు ఘనమైన పొన్న పువ్వే
గౌరమ్మ గజ్జల ఒడ్డానమే గౌరమ్మ
ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి
కుుంకుమల జాడించి
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తు మే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తు మే గౌరమ్మ
ఆ పూలు తెప్పించి గంధములు కడిగించి
కుుంకుమల జాడించి
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తు మే గౌరమ్మ
మా నోము మాకియ్యవే గౌరమ్మ
నీ నోము నీకిత్తు మే గౌరమ్మ