కల్వకుర్తి పట్టణంలో ముగిసిన అత్యపత్య జాతీయ స్థాయి క్రీడలు

కల్వకుర్తి పట్టణంలో ముగిసిన అత్యపత్య జాతీయ స్థాయి క్రీడలు

కల్వకుర్తి, వెలుగు: మూడు రోజులుగా పట్టణంలో జరుగుతున్న అత్యపత్య 9వ జాతీయ స్థాయి పోటీలు శనివారం ముగిసాయి. మెన్స్, ఉమెన్స్  విభాగంలో జరిగిన ఈ క్రీడల్లో 8 రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమానికి కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, పొల్యూషన్  బోర్డ్  మెంబర్  బాలాజీ సింగ్  హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. 

అత్పపత్య ఆడడంతో శారీరక, మానసిక దృఢత్వం కలుగుతుందని చెప్పారు. మహిళల విభాగంలో కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్ర జట్లు మొదటి, రెండవ, మూడవ స్థానం దక్కించుకున్నాయి. పురుషుల విభాగంలో పుదుచ్చేరి, మహారాష్ట్ర, కర్నాటక టీమ్స్​ ఫస్ట్, సెకండ్, థర్డ్​ ప్లేస్​లు దక్కించుకున్నాయి. 

స్టేట్  సెక్రటరీ ముఖేశ్, రాష్ట్ర అధ్యక్షుడు ప్రదీప్ కుమార్, ఒలంపిక్  అసోసియేషన్  జనరల్  సెక్రటరీ మల్లారెడ్డి, ట్రెజరర్​ ప్రవీణ్ పాల్గొన్నారు.