అరబిందో ఫార్మా హెచ్​ఐవీ డ్రగ్కు ఆమోదం

అరబిందో ఫార్మా హెచ్​ఐవీ డ్రగ్కు ఆమోదం

న్యూఢిల్లీ : హెచ్​ఐవీ-–1 ఇన్ఫెక్షన్ ట్రీట్​మెంట్​ కోసం  జెనరిక్ డ్రగ్​ను మార్కెట్ చేయడానికి యూఎస్ హెల్త్ రెగ్యులేటర్ నుంచి  అనుమతి పొందినట్లు అరబిందో ఫార్మా బుధవారం తెలిపింది. 600 ఎంజీ,  800 ఎంజీ డోసుల్లో డారునవీర్​ మాత్రలను తయారు చేయడానికి,  మార్కెట్ చేయడానికి తుది ఆమోదం పొందామని హైదరాబాద్‌‌‌‌కు చెందిన ఈ డ్రగ్ మేకర్  తెలిపింది. 

కంపెనీ ప్రొడక్ట్​ రిఫరెన్స్ లిస్టెడ్ డ్రగ్  ప్రెజిస్టా టాబ్లెట్‌‌‌‌లు, 600 ఎంజీ  800 ఎంజీ డోసులకు సమానం. ఈ ఉత్పత్తిని బుధవారం విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.  ఐక్యూవీఐఏ డేటా ప్రకారం, ఈ డ్రగ్​ మార్కెట్ ​సైజు అక్టోబర్ 2023తో ముగిసిన 12 నెలలకు 274.8 మిలియన్ల డాలర్లు ఉంది.