రూ. 409 కోట్లుగా అరబిందో ఫార్మా నికర లాభం

రూ. 409 కోట్లుగా అరబిందో ఫార్మా నికర లాభం

రూ.5,739 కోట్లకు రెవెన్యూ

హైదరాబాద్‌‌‌‌: అరబిందో ఫార్మా నికర లాభం సెప్టెంబర్‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌ (క్యూ2) లో 41 శాతం తగ్గి రూ. 409 కోట్లుగా రికార్డయ్యింది.  రెవెన్యూ 3 శాతం తగ్గి రూ.5,739 కోట్లకు, ఇబిటా 30 శాతం తగ్గి రూ. 837 కోట్లుగా నమోయ్యింది. కంపెనీ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (మందుల్లో వాడే ఇంటర్మీడియెట్స్‌‌) బిజినెస్ క్యూ2 లో ఏడాది ప్రాతిపదికన 24 శాతం పెరగగా, కంపెనీ మొత్తం రెవెన్యూలో ఈ సెగ్మెంట్ వాటా 17 శాతానికి చేరుకుంది. మొత్తం ఫార్ములేషన్స్ ( మందులు) వాటా 8 శాతానికి పడింది. యూఎస్ ఫార్ములేషన్‌‌ బిజినెస్‌‌   క్యూ2 లో 11 శాతం తగ్గి రూ. 2,638 కోట్లుగా రికార్డయ్యింది. ఇది కంపెనీ మొత్తం రెవెన్యూలో 40 శాతంగా ఉంది.  సెప్టెంబర్ క్వార్టర్‌‌‌‌లో యూఎస్‌‌లో ఆరు కొత్త ప్రొడక్ట్‌‌లను లాంచ్ చేశామని,  రెండు ఇంజెక్టబుల్స్‌‌ను లాంచ్ చేశామని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. తొమ్మిది ప్రొడక్ట్‌‌ల అబ్రివేటెడ్ న్యూ డ్రగ్‌‌ అప్లికేషన్ (ఏఎన్‌‌డీఏ) కు యూఎస్ ఎఫ్‌‌డీఏ నుంచి ఫైనల్ అప్రూవల్స్ వచ్చాయని తెలిపింది.  

యూరప్‌‌ మార్కెట్ నుంచి వచ్చే రెవెన్యూ 9 శాతం తగ్గిందని, కంపెనీ మొత్తం సేల్స్‌‌లో ఈ మార్కెట్ వాటా 26 శాతంగా ఉందని వివరించింది. లోకల్ మార్కెట్‌‌లో మాత్రం ఫార్ములేషన్స్ సేల్స్ 17 శాతం పెరిగాయని, మొత్తం రెవెన్యూలో ఈ బిజినెస్ వాటా 8 శాతంగా రికార్డయ్యిందని అరబిందో ఫార్మా పేర్కొంది. యాంటి రెట్రోవైరల్ ఫార్ములేషన్స్‌‌ రెవెన్యూ క్యూ2 లో 13 శాతం పెరగగా, మొత్తం రెవెన్యూలో  ఈ సెగ్మెంట్‌‌ వాటా 3 శాతానికి చేరుకుందని తెలిపింది.  మాక్రో ఎకనామిక్‌‌ పరిస్థితులు, యూఎస్‌‌లో కొన్ని ప్రొడక్ట్‌‌లకు కాంపిటీషన్ పెరగడం  వలన తమ క్యూ2 పెర్ఫార్మెన్స్‌‌ తగ్గిందని  కంపెనీ వైస్ చైర్మన్ కే నిత్యానంద రెడ్డి అన్నారు. కొత్తగా తెస్తున్న ప్రొడక్ట్‌‌ల వలన భవిష్యత్‌‌లో తమ గ్రోత్ బాగుంటుందని వివరించారు. కాగా, కంపెనీ హోల్‌‌టైమ్ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడంతో గురువారం 12 శాతం క్రాష్ అయిన అరబిందో ఫార్మా షేర్లు, శుక్రవారం 1.9 శాతం లాభపడ్డాయి.