నల్ల బ్యాడ్జీలు ధరించిన ఆసీస్ ఆటగాళ్లు.. కమ్మిన్స్కు మాతృవియోగం

నల్ల బ్యాడ్జీలు ధరించిన ఆసీస్ ఆటగాళ్లు.. కమ్మిన్స్కు మాతృవియోగం

ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతున్న కమ్మిన్స్ తల్లి మారియా కమ్మిన్స్ తుది శ్వాస విడిచినట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకుంది. దీంతో ఆవిడకు సంతాప సూచకంగా ఆసీస్ ప్లేయర్లంతా ఇవాళ నల్ల రిబ్బన్లు ధరించి ఆటకు దిగారు. 

తల్లిని చూసేందుకు కమ్మిన్స్ రెండో టెస్టు ముగిసిన రోజే  సిడ్నీకి పయనమయ్యాడు. మూడో టెస్టుకు దూరంగా ఉన్న కమ్మిన్స్ ఆఖరి టెస్టుకు రాలేనని బోర్డుకు తెలిపాడు. మారియా కమ్మిన్స్ 2005 నుంచి రొమ్ము క్యాన్సర్ తో బాధపడుతుంది. గత కొన్ని వారాలుగా వ్యాధి ఎక్కువ కావడంతో తనను హాస్పిటల్ కు తరలించారు.  దాదాపు నాలుగు వారాలు హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి నిన్న రాత్రి కన్ను మూసింది.