అఫ్గాన్‌పై గట్టెక్కిన ఆసీస్‌

అఫ్గాన్‌పై గట్టెక్కిన ఆసీస్‌

అడిలైడ్‌‌‌‌: భారీ విజయంతో రన్‌‌రేట్‌‌ పెంచుకొని టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో సెమీఫైనల్‌‌ చేరుకోవాలన్న డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ఆస్ట్రేలియా.. చిన్న జట్టు అఫ్గానిస్తాన్‌‌పై అతి కష్టంగా గెలిచింది. అఫ్గాన్‌‌ ఆల్‌‌రౌండర్ రషీద్‌‌ ఖాన్‌‌ (23 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 48 నాటౌట్‌‌) మెరుపు బ్యాటింగ్‌‌తో ఆతిథ్య జట్టును వణికించాడు. చివరి ఓవర్లో అఫ్గాన్‌‌కు 22 రన్స్‌‌ అవసరం అవగా.. రషీద్‌‌ 17 రాబట్టగలిగాడు. దాంతో, ఆసీస్‌‌ 4 పరుగుల తేడాతో గట్టెక్కి సెమీఫైనల్‌‌ ఆశలు సజీవంగా నిలుపుకుంది. సూపర్‌‌12, గ్రూప్‌‌1లో భాగంగా  శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో తొలుత ఆసీస్‌‌ 20 ఓవర్లలో 168/8 స్కోరు చేసింది.

మ్యాక్స్‌‌వెల్‌‌ (32 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌‌) ఫిఫ్టీ కొట్టగా.. మిచెల్‌‌ మార్ష్‌‌ (45), వార్నర్‌‌ (25), స్టోయినిస్‌‌ (25) రాణించారు. ఛేజింగ్‌‌లో అఫ్గాన్‌‌ 20 ఓవర్లలో 164/7 స్కోరు చేసి ఓడింది. చివరి 18 బాల్స్‌‌లో అఫ్గాన్​కు 49 రన్స్‌‌ అవసరమైన దశలో రషీద్‌‌ ఫోర్లు, సిక్సర్లతో అనూహ్యంగా రెచ్చిపోయాడు. కానీ, ఆఖరి ఓవర్లో 22 రన్స్​ రాబట్టలేకపోవడంతో ఆసీస్​ ఊపిరిపిల్చుకుంది. ఈ మ్యాచ్​లో గెలిచిన ఆసీస్​ 7 పాయింట్లతో (-–0.173 రన్​రేట్​)తో న్యూజిలాండ్ తర్వాత రెండో ప్లేస్​లో ఉంది కివీస్ (7 పాయింట్లు; 2.113 రన్‌‌రేట్‌‌)​కు ఇప్పటికే సెమీస్​ బెర్తు ఖాయం అవగా.. మెరుగైన రన్​రేట్​తో ఉన్న ఇంగ్లండ్ (5 పాయింట్లు; 0.547 రన్‌‌రేట్‌‌)​ శనివారం శ్రీలంకపై గెలిస్తే ఆసీస్​ను వెనక్కునెట్టి సెమీస్​ చేరుకుంటుంది. కాగా, ​ ఈ టోర్నీలో అఫ్గాన్​ గెలుపు రుచి చూడలేదు. ఐదు మ్యాచ్​ల్లో మూడు ఓడగా, మరో రెండు రద్దయ్యాయి.  జట్టు చెత్తాటకు బాధ్యతగా  అఫ్గాన్​  కెప్టెన్​ మహ్మద్​ నబీ కెప్టెన్సీకి రిజైన్​ చేశాడు.