పార్లమెంట్​లోనే లైంగిక దాడికి గురయ్యా.. సభలో ఆస్ట్రేలియా ఎంపీ కన్నీళ్లు..

పార్లమెంట్​లోనే లైంగిక దాడికి గురయ్యా.. సభలో ఆస్ట్రేలియా ఎంపీ కన్నీళ్లు..

సిడ్నీ: పార్లమెంట్‌‌లోనే తనపై లైంగిక దాడి జరిగిందంటూ ఆస్ట్రేలియా ఎంపీ లిడియా థోర్ఫ్ నిండు సభలో కన్నీళ్లు పెట్టుకున్నారు. లేడీస్ కు  పార్లమెంట్ కూడా సేఫ్ కాదన్నారు. సెనేటర్ డేవిడ్ వాన్‌‌ తనను నెట్టేశాడని, తిడుతూ అసభ్యంగా తాకాడని  ఆరోపించారు. అయితే, పార్లమెంటరీ ఆంక్షల భయంతో లిడియా తన కామెంట్లను బలవంతంగా వెనక్కి తీసుకున్నారు.

లిడియా కామెంట్స్​లో నిజం లేదని, ఆమె ఆరోపణలు తనను బాధించాయని డేవిడ్ ఖండించారు. అయితే, లిడియా ఆరోపణల నేపథ్యంలో డేవిడ్ ను గురువారం లిబరల్ పార్టీ సస్పెండ్ చేసింది.