టాయిలెట్స్లో కంటే వాటర్ బాటిల్స్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా: స్టడీ

టాయిలెట్స్లో కంటే వాటర్ బాటిల్స్ పైనే ఎక్కువ బ్యాక్టీరియా: స్టడీ

ఓసీడీ ఉన్నవాళ్లు బయట ఏం తినాలన్నా.. తాగాలన్నా ఇబ్బంది పడుతుంటారు. బ్యాక్టీరియా, ఫంగస్ ఉంటుందని వాళ్లతో పాటు వాటర్ బాటిల్స్ తీసుకెళ్తుంటారు. అలాంటివాళ్లకు ఆస్ట్రేలియన్ కాథలిక్ యూనివర్శిటీ క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్లు షాకింగ్ నిజాలు చెప్పారు. రీ యూజబుల్ వాటర్ బాటిల్స్ పైన టాయిలెట్స్ లో ఉండేదానికన్నా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని తేల్చి చెప్పారు. 

ఆస్ట్రేలియన్ కాథలిక్ యూనివర్శిటీ క్లినికల్ సైకాలజిస్ట్, హోర్డింగ్ డిజార్డర్ నిపుణుడు.. అసోసియేట్ ప్రొఫెసర్ కియోంగ్ యాప్ ఈ విషయాన్ని కనుగొన్నాడు. ఆయన నివేదికను యూఎస్ ఆధారిత వాటర్ ఫిల్టర్ గురు.కామ్ విడుదల చేసింది. అందులో వాటర్ బాటిల్స్ పై టాయిలెట్స్ లో ఉండే బ్యాక్టీరియా కన్నా 40,000 వేల రెట్లు ఎక్కువ ఉంటుందని కనుగొన్నారు. 

ముందు ఈ అధ్యాయనాన్ని బాటిల్ మూతలపై చేశారు. బాటిల్స్ ని మొదట రెండు సార్లు శుభ్రం చేసిన వాటిపై ఉండే బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాలేదు. అంతేకాదు బ్యాక్టీరియాకు అనువైన చోటుగా కూడా వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ బ్యాక్టీరియా వల్ల శరీరంలో ఉండే యాంటీబయోటిక్స్ చనిపోయి ఇన్ ఫెక్షన్ లకు కారణం అవుతుంది. కొన్ని రకాల బాసిల్లస్ జీర్ణాశయాంతర సమస్యలకు దారి తీస్తుంది. 

వాటర్ బాటిల్స్ లోనే కాకుండా కిచెన్ సింక్, కంప్యూటర్ మౌజ్,పెంపుడు జంతువులకు ఫుడ్ పెట్టే గిన్నెల్లో కూడా ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధనలో గుర్తించారు.