
టెక్సాస్: భారత సంతతి చెఫ్ రిషి రూప్ సింగ్‌ను పెండ్లి చేసుకున్న ఆస్ట్రియన్ యువరాణి మరియా గాలిట్జిన్(31) ఆకస్మికంగా చనిపోయారు. అమెరికాలోని హ్యూస్టన్ సిటీలో యువరాణి సోమవారం ఉదయం కార్డియాక్ ఎన్యూరిజంతో హఠాత్తుగా చనిపోయారని కుటుంబ సభ్యులు ధృవీకరించారు. కాగా ప్రిన్సెస్ గాలిట్జిన్ 1988లో రష్యన్ ప్రిన్స్ పియోటర్ గాలిట్జిన్, ఆస్ట్రియాకు చెందిన ఆర్కిడ్యూస్ మరియా అన్నా దంపతులకు జన్మించారు. 2017 ఏప్రిల్ లో ఇండియన్ ఆరిజిన్ రిషి రూప్ సింగ్ ని పెళ్లి చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కొడుకు మాగ్జిమ్ ఉన్నాడు. రష్యాలోని జర్మన్ స్కూల్ ఆఫ్ మాస్కోలో విద్యాభ్యాసం చేసిన ఆమె.. బెల్జియంకు మారిన తర్వాత మరియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ స్కూళ్లో చదివారు. ఇంటీరియర్ డిజైన్, ఫర్నిషింగ్‌లో ఎక్స్ పర్ట్ అయిన మరియా గాలిట్జిన్ బ్రస్సెల్స్, చికాగో, హ్యూస్టన్ సిటీలలో పనిచేశారు.