కరోనాతో చనిపోయిందని దహనం చెయ్యనియ్యలె

కరోనాతో చనిపోయిందని దహనం చెయ్యనియ్యలె

ఓ మహిళ కరోనాతో చనిపోయిందని శ్మశాన వాటిక నిర్వాహకులు ఆమె డెడ్ బాడీకి అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అనుమతించలేదు. ఢిల్లీలో 69 ఏండ్ల వృద్ధురాలు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. అంత్యక్రియలు చేసేందుకు కుటుంబ సభ్యులు డెడ్ బాడీని ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ కు తీసుకెళ్లారు. అయితే నిర్వాహకులు తమను అడ్డుకున్నారని, డెడ్ బాడీని వేరే ప్లేస్ కు తీసుకెళ్లాలని సూచించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇదికాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్వాహకులు దిగొచ్చారు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నిపుణుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. ‘‘కరోనా బాధితుల బాడీ విషపూరితమవుతుంది. డెడ్ బాడీలోనూ వైరస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలు నిర్వహించే కుటుంబ సభ్యులకు వైరస్ సోకే ప్రమాదం ఉంది. శ్మశాన వాటికల్లో క్రౌడ్ ఉంటుంది కాబట్టి వారికీ వ్యాప్తి చెందే అవకాశం ఉంది” అని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.