
సుల్తానాబాద్ .వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ కొడుకు ఎంబీబీఎస్ సీటు సాధించాడు. గ్రామా నికి చెందిన శేఖర్ గౌడ్ ఆటోడ్రైవర్. అతని కొడుకు అవినాష్ను కష్టపడి చదివించాడు.
నీట్ లో ర్యాంకు సాధించగా రామగుండం. మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించాడు. అవినాష్ తొగర్రాయిలో ప్రైమరీ, కరీంనగర్ ప్రభుత్వ హైస్కూల్లో టెన్త్ చదివాడు. మెడిసిన్లో సీటు సాధించిన అవినాష్ ను స్థానిక నాయకుడు చిట్టవేని సదయ్య, గ్రామస్తులు అభినందించారు.