నన్ను చూసి నేనే భయపడ్డా!

నన్ను చూసి నేనే భయపడ్డా!

‘చిన్నారి పెళ్లికూతురు’గా పరిచయమై.. ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్తమావ వంటి చిత్రాలతో తెలుగువారికి చేరువయ్యిం ది అవికా గోర్. కాస్త గ్యాప్ తర్వాత ఆమె నటిం చిన తెలుగు చిత్రం ‘రాజుగారి గది 3’. ఈ సినిమా అక్టోబర్ 18న రిలీజ్ కానున్న క్రమంలో మూవీ గురించి ఆమె చెప్పిన ముచ్చట్లు.

తెలుగులో గ్యాప్‌‌ రావడానికి కారణం ఉంది. ఓ చానెల్‌‌లో సీరియల్‌‌కి చాలా రోజులుగా పని చేస్తున్నాను. హిందీలో కొన్ని సినిమా చాన్సులు కూడా వచ్చాయి. అందుకే తెలుగు సినిమాలకి డేట్స్ ఇవ్వలేకపోయాను.

ఓంకార్‌‌‌‌ ఈ పాత్రను తమన్నా కోసం రాసుకున్నానని, ఆవిడ డేట్స్‌‌ ఇవ్వలేకపోయారని చెప్పారు. నేనైతే బాగా చేస్తానని ఆయన
నమ్మడంతో ఓకే అన్నాను.

ఈ కథను ఓంకార్ నాకు నలభై నిమిషాల్లో నేరేట్ చేశారు. చాలా నచ్చింది. కాకపోతే నాకు హారర్ సినిమాలంటే భయం. ఒక్క దాన్నీ పొరపాటున కూడా చూడను. అందుకే కథ వినేటప్పుడే టెన్షన్‌‌ పడ్డాను. కానీ ఇందులో కామెడీ ఫుల్లుగా ఉంది. కథ వింటున్నంతసేపూ నవ్వుతూనే ఉన్నాను. అందుకే ధైర్యంగా అంగీకరించాను.

ఇందులో నా పాత్ర సింపుల్‌‌గా, పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. కేరళ నుంచి వచ్చిన ఒకమ్మాయి కథ. స్టోరీ ఏమిటనేది మాత్రం చెప్పను.. తెర మీద చూడాల్సిందే.

నా లుక్  భయంకరంగా ఉంది. ఆ గెటప్‌‌లో నన్ను చూసి నాకే భయమేసింది. మొదట్లో రెండు రోజులు నిద్ర పోలేదు. కానీ మేకప్​ తీసేస్తే కనిపించేది నీ ముఖమే కదా అని మా డాడీ నాకు ధైర్యం చెప్పారు. ట్రైలర్​ చూసినప్పుడు కూడా చాలా భయపడ్డా. నాకు తెలిసి చూసినవాళ్లు కూడా భయపడే ఉంటారు. అయితే ఆ భయం వెనుక ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ కూడా ఉందని సినిమా చూశాక తెలుస్తుంది.

ఇది ఒక కొరియన్​ మూవీకి రీమేక్​. హారర్ సినిమాలంటే భయం కనుక ఒరిజినల్‌‌ మూవీని చూడలేదు.  అందుకే ఈ సినిమా కోసం  ఎలాంటి హోమ్‌‌ వర్క్​ చేయలేదు.

అలీ గారు, బ్రహ్మాజీ గారు వంటి మంచి యాక్టర్స్‌‌తో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా నాకో బ్రిలియంట్​ఎక్స్​పీరియన్స్​నిచ్చింది. అయితే అలీగారితో కలిసి నటిస్తున్నప్పుడు మాత్రం కొంచెం షివరింగ్​ వచ్చింది. అలాంటి సీనియర్​ యాక్టర్స్‌‌తో నటిస్తే అనుభవం వస్తుందని మా మమ్మీ ఎంకరేజ్​ చేసింది.

తమన్నా కోసం రాసిన పాత్రలో నటించడానికి నేను అస్సలు సంకోచించలేదు. నేనైనా, తమన్నా అయినా,  కాజల్​ అయినా.. ఏ హీరోయిన్‌‌ అయినా కథకు అనుగుణంగా చెయ్యాల్సిందే కదా. డైరెక్టర్ చెప్పినట్టు వినాల్సిందే కదా. అందుకే నేను నా బెస్ట్​ ఇచ్చానా లేదా అనేది మాత్రమే చూస్తాను.

నాకు ఇప్పటికే చాలా కమిట్‌‌మెంట్స్​ఉన్నాయి. తెలుగులో మరో మంచి సినిమాకి సైన్​చేశాను. ఓ పది రోజుల్లో వివరాలు చెప్తాను. అది హారర్​ సినిమా అయితే కాదు. టైమ్​ ఉంటే వెబ్​ సిరీస్‌‌లో కూడా నటిస్తాను.

ఎనిమిదేళ్ల వయసు నుంచే సీరియల్స్​లో యాక్ట్ చేయడం మొదలుపెట్టా. అందుకే ఎక్కువ టీవీకే ఇంపార్టెన్స్​ఇస్తాను. అది హిందీయా, తెలుగా అని చూడను. ఏ భాషయినా ఓకే. కాకపోతే నాకు తెలుగు అర్థమవుతుంది. కానీ మాట్లాడటానికి కొంచెం టైమ్​ పడుతుంది. త్వరలో హైదరాబాదుకి షిప్ట్​ అవుదామనుకుంటున్నా.