
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ కు చెందిన సినీ హీరో అజయ్ వేద్‌కు ఇంటర్నేషనల్ అవార్డు దక్కింది. అజయ్ మట్టి కథ అనే సినిమాలో హీరోగా చేశారు. ఈ సినిమాను ఇండో ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించగా అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది. తన మొట్టమొదటి సినిమాలోనే ఉత్తమ నటన ప్రదర్శించి అవార్డు పొందిన అజయ్‌ను పలువురు అభినందించారు.