లక్ష్మణచాంద, వెలుగు: మండలంలోని ధర్మారం గ్రామంలో ఆశీర్వాద్ స్టార్ట్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారం అయోడిన్ లోపం పై కళాకారులు ప్రదర్శన నిర్వహించారు. ఆయోడిన్ లోపం ఉంటే మందబుద్ధి, శారీరక ఎదుగుదల లోపిస్తుందని ప్రజలకు వివరించారు. గర్భిణులు, బాలింతలు పిల్లలు అయోడిన్ ఉండే చేపలు, రొయ్యలు, కూరగాయలు, ఆకుకూరలు, పాలు నాణ్యమైన పౌష్టికాహారం ప్రతిరోజు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా కోఆర్డినేటర్ మునిగాల హుస్సేన్, ఓఆర్ డబ్ల్యు జి.శివ,అంగన్వాడి ఉపాధ్యాయురాలు గీత, పంచాయతీ సెక్రెటరీ జి.మేఘన,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.