అయోధ్యకు డబ్బే డబ్బు : ప్రతి నెలా రూ.2 కోట్ల విరాళం..

అయోధ్యకు డబ్బే డబ్బు : ప్రతి నెలా రూ.2 కోట్ల విరాళం..

దశాబ్దపు అతిపెద్ద ఈవెంట్‌లలో ఒకదానికి ఇప్పుడు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పవిత్ర నగరమైన అయోధ్యలో జనవరి 22న రామమందిర ప్రారంభోత్సవం జరగనుండటంతో ఈ సమయం కోసం దేశం మొత్తం ఉత్కంఠతో ఎదురు చేస్తోంది. ఈ గ్రాండ్ ప్రారంభోత్సవానికి ముందు, రామ్ లల్లాకు చదవా (నైవేద్యం), భక్తుల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుత పరిస్థితి ప్రకారం రామమందిరం ట్రస్ట్‌కి రోజూ మూడు నుంచి నాలుగు లక్షల విలువైన విరాళాలు అందుతున్నాయని సమాచారం. నెలవారీ విరాళాల విషయానికొస్తే.. ట్రస్టుకు ప్రతి నెలా దాదాపు రూ.1.5 నుంచి రూ.2 కోట్లు అందుతున్నాయి.

అంతకుముందు, ట్రస్ట్ సేకరణను మాన్యువల్‌గా లెక్కించేది, కానీ ఇప్పుడు నగదు లెక్కింపు యంత్రాల (cash counting machines)ను ఉపయోగించడం ప్రారంభించారు. ఇందుకు కారణం రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి భారీగా విరాళాలు వెల్లువెత్తడమే. ప్రారంభంలో ప్రతి నెల ఐదవ, 20వ తేదీల్లో ప్రసాదాల లెక్కింపు జరిగేదని, కానీ ఇప్పుడు, ఈ పని ప్రతిరోజూ జరుగుతోందని, ఇందుకోసం ట్రస్ట్ నగదు లెక్కింపు యంత్రాలను ఉపయోగించడం ప్రారంభించిందని అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలియజేశారు,  

రామమందిరంలో విరాళాలు కాకుండా ఆన్‌లైన్, చెక్కు, నగదుతో సహా వివిధ రీతుల్లో భక్తుల నుండి ట్రస్ట్ రోజువారీ విరాళాలను స్వీకరిస్తోందిి. ఇతర మార్గాల ద్వారా సేకరించిన విరాళాలు రోజుకు దాదాపు రూ.2 లక్షల వరకు ఉందని సమాచారం. ట్రస్ట్‌కు నెలవారీ కోటి రూపాయల కంటే ఎక్కువ విరాళాలు అందుతున్నాయని అంచనా. న్యూఢిల్లీలోని ట్రస్ట్ బ్యాంకు ఖాతాలో ఎన్నారైల నుంచి కూడా విరాళాలు స్వీకరిస్తున్నారు.

జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆలయ నిర్మాణ పనులకు బాధ్యత వహిస్తున్న శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చూస్తోంది. ట్రస్ట్ 44 రోజుల దేశవ్యాప్త నిధుల సేకరణ ప్రచారం - శ్రీ రామ జన్మభూమి రామ మందిరం నిధి సమర్పణ అభియాన్ - జనవరి 15, 2021న ప్రారంభించారు. గత మూడేళ్లలో ఆలయ ట్రస్టుకు విరాళాలు దాదాపు రూ. 5వేల కోట్లకు చేరుకున్నాయి. ఇలా స్వీకరించబడిన నిధులు ట్రస్ట్ నియమించిన బ్యాంక్ ఖాతాలలో జమ అవుతాయి.