హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ అరెస్ట్

హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న ఆయుర్వేద డాక్టర్ను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమబెంగాల్కి చెందిన మహమ్మద్ షబీర్ అలీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి 53 గ్రాముల MDMA, 850 గ్రాముల కేటమైన్ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ షబీర్ అలీ కోల్కతా యూనివర్సిటీలో ఆయుర్వేద కోర్స్ చేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ కు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఈజీగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో డ్రగ్స్ దందా మొదలుపెట్టినట్లు చెప్పారు. డ్రగ్స్ కోసం ఇండియా మార్ట్ వెబ్సైట్లో అలీ సెర్చ్ చేసినట్లు గుర్తించారు. బ్లూ డాట్ కొరియర్ ద్వారా అతడు డ్రగ్స్ సప్లై చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసులో కాకు , శివ అనే ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.