‘థామ’తో భయపెట్టడానికి వస్తున్న రష్మిక మందన్నా.. హారర్ కామెడీ థ్రిల్లర్‌లో శ్రీవల్లి

‘థామ’తో భయపెట్టడానికి వస్తున్న రష్మిక మందన్నా.. హారర్ కామెడీ థ్రిల్లర్‌లో శ్రీవల్లి

సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ తన మార్కెట్‌ను పెంచుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. హిందీలో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ‘థామ’ చిత్రంలో నటిస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇండిపెండేన్స్ డే సందర్భంగా  క్రేజీ అప్‌డేట్‌ను అందించారు మేకర్స్. ఆగస్టు 19న ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే  ‘ది వరల్డ్ ఆఫ్ థామ’  భయపెట్టడానికి వస్తోంది అంటూ దీపావళికి ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

‘ఒక  ప్రేమకథ  ఇంతకు ముందు చూసిన దానికంటే క్రూరంగా, ప్రాణాంతకంగా ఉంటుంది’ అని మేకర్స్ పోస్ట్ చేయడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలక పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు రష్మిక నటించిన ‘గీత గోవిందం’ చిత్రం విడుదలై నిన్నటితో ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా తన కెరీర్‌‌లో ఇది స్పెషల్ మూవీ అని పోస్ట్ చేసింది. విజయ్ దేవరకొండతో ఆమె నటించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు.