రాయికల్లో ఘనంగా ఆరట్టు ఉత్సవం

రాయికల్లో ఘనంగా ఆరట్టు ఉత్సవం

రాయికల్, వెలుగు/కోరుట్ల :   రాయికల్, కోరుట్ల పట్టణాల్లో  బుధవారం అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం కన్నులపండువగా జరిగింది. స్థానిక అయ్యప్ప దేవాలయం నుంచి స్వామి వారిని  ప్రధాన వీధుల్లో ఊరేగించారు.  

పెద్ద చెరువు వరకు తీసుకెళ్లి చక్రస్నానం చేయించారు. అయ్యప్ప దీక్ష పరుల నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కోరుట్ల లోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం ఆరట్టు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  విగ్రహానికి చక్రస్నానం జరిపి , ప్రత్యేకరథంపై ప్రధాన వీధుల గుండా అయ్యప్ప ఆలయం వరకు రథోత్సవం జరిపారు.  అనంతరం  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేపట్టారు.