Babar Azam: కోహ్లీ, బుమ్రాని పక్కన పెట్టిన బాబర్ అజామ్.. వరల్డ్ ప్లేయింగ్ టీ20 జట్టు ప్రకటన

Babar Azam: కోహ్లీ, బుమ్రాని పక్కన పెట్టిన బాబర్ అజామ్.. వరల్డ్ ప్లేయింగ్ టీ20 జట్టు ప్రకటన

పాకిస్థాన్ స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ టీ20 క్రికెట్ లో తన ఆల్ టైం ప్లేయింగ్ 11 ను ప్రకటించాడు. తన ప్లేయింగ్ 11 లో ఆరుగురు బ్యాటర్లు.. నలుగురు పేసర్లు.. ఏకైక స్పిన్నర్ ను ఎంచుకున్నాడు. ఓపెనర్ గా మహ్మద్ రిజ్వాన్ తో పాటు మాజీ టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మకు ఛాన్స్ ఇచ్చాడు. ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలకు సెలక్ట్ చేశాడు. ఫినిషింగ్ బాధ్యతలు సఫారీ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ కు అప్పగించాడు. రిజ్వాన్, బట్లర్ రూపంలో ఇద్దరు వికెట్ కీపర్లు జట్టులో ఉన్నారు. 

ఆల్ రౌండర్లుగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. ఏడు, ఎనిమిది స్థానాలకు సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో జాన్సెన్ తో పాటు.. రషీద్ ఖాన్ లను ఎంపిక చేశాడు. జట్టు మొత్తంలో రషీద్ ఖాన్ ఏకైక స్పిన్నర్ కావడం విశేషం. వీరిద్దరికీ బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం కూడా ఉంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లకు అవకాశమిచ్చారు. వీరిలో ఆస్ట్రేలియా పేసర్లు ఇద్దరు ఉండడం విశేషం. ఆసీస్ జట్టులోని కమ్మిన్స్, స్టార్క్   పేస్ బౌలింగ్ బాధ్యతలు పంచుకుంటారు. వీరికి తోడుగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ మరో ఫాస్ట్ బౌలర్. 

►ALSO READ | IND vs ENG: కరుణ్ నాయర్, కిషాన్‌లకు చోటు.. ఇంగ్లాండ్ టూర్‌కు ఇండియా 'ఏ' స్క్వాడ్ ప్రకటన

బాబర్ అజమ్ ఎంపిక చేసిన జట్టులో టీ20 వీరులు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాలకు లేకపోవడం ఆశర్యం కలిగిస్తుంది. ఈ జట్టులో పాకిస్థాన్ ఓపెనర్ ఫకర్ జమాన్ కు ఛాన్స్ ఇవ్వడం మరో వింత. సౌతాఫ్రికా పవర్ ఫుల్ హిట్టర్ క్లాసన్ క్లాసన్, విండీస్ విధ్వంసకర వీరుడు  పూరన్ లను బాబర్ పట్టించుకోలేదు. ఇక ఈ జట్టుకు బాబర్ కెప్టెన్ ను ప్రకటించకుండా షాక్ కు గురి చేశాడు. న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్ జట్ల నుంచి ఒక్కరినీ కూడా సెలక్ట్ చేయలేదు. 

టీ20 క్రికెట్‌లో బాబర్ అజామ్ వరల్డ్ XI:

రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్, సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, రషీద్ ఖాన్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ మరియు మార్క్ వుడ్.