Garbh Sanskar: గర్బంలో శివులకు గీతా శ్లోకాలు,రామాయణం నేర్పుతారు

Garbh Sanskar: గర్బంలో శివులకు గీతా శ్లోకాలు,రామాయణం నేర్పుతారు

భారతీయ సంస్కృతి సంప్రదాయాలు తెలియజేసేందుకు, ముందు తరాలకు అందించడం కోసం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ నడుం బిగించింది. ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ సంవర్ధినీ న్యాస్ గర్భిణుల కడుపులో ఉన్న సంతానికి భారతీయ సంస్కృతి, విలువలను నేర్పడానికి 'గర్భ సంస్కార్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించింది. ఇదే విషయాన్ని  సంవర్ధినీ న్యాస్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాధురీ మరాఠే తెలిపారు. మహిళల గర్భంలోని శిశువులు గీత, రామాయణ పాఠాలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఆధ్వర్యంలో కొత్త కసరత్తు చేస్తున్నారని చెప్పారు. 

గర్భిణులకు నిపుణుల సమక్షంలో శిక్షణ ఇవ్వనున్నారు. గైనకాలజిస్టులు, ఆయుర్వేద వైద్యులు, యోగా శిక్షకులతో ట్రైనింగ్ ఇస్తారు. ఈ కార్యక్రమం గర్భం దాల్చినప్పటి నుంచి రెండేళ్లలోపు శిశువుల వరకు ప్రారంభమవుతుందని చెబుతున్నారు. గీతా శ్లోకాలు, రామాయణ చౌపాయిలను పఠించడం ద్వారా గర్భంలో ఉన్న శిశువు 500 పదాల వరకు నేర్చుకోగలరని మరాఠే అన్నారు. ప్రారంభంలో దాదాపు వెయ్యి మంది మహిళలకు ఈ కార్యక్రమాన్ని చేర్చాలని ఆర్‌ఎస్‌ఎస్ మహిళా విభాగం, రాష్ట్ర సేవికా సమితికి చెందిన సంవర్ధినీ న్యాస్ ప్లాన్ చేస్తోంది. ఈ ప్రచారంలో భాగంగా  సంవర్ధినీ న్యాస్ మార్చి 5వ తేదీన జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరయ్యారు.