సుమంత్ ప్రభాస్ హీరోగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ సాయిలు కంపాటి దర్శకత్వంలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ ఎన్. నారంగ్ నిర్మిస్తున్న చిత్రం ‘బబ్లూ డబుల్ ఎక్స్‌ఎల్ ’. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫస్ట్ స్పార్క్ పేరుతో స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇందులో బబ్లూ ప్రేమకథ ఎలా మొదలవుతుందో ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. తొలిచూపులోనే ప్రేమ పుట్టే క్షణంలోని మ్యాజిక్‌ను, ఆ సమయంలో కలిగే ఉత్సాహం, ఆసక్తి, అందమైన భావోద్వేగాలను ఈ ఫస్ట్ స్పార్క్ ఎంతో అందంగా ప్రజెంట్ చేస్తోంది.
ఈ గ్లింప్స్ ద్వారా గహజీ ఎస్‌కేను హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. బబ్లూతో ఆమెకు ఎదురయ్యే తొలి పరిచయం ఒక ఫ్రెష్ రొమాంటిక్ ట్రాక్‌కు పునాది వేస్తుంది. వీరిమధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ మరింత అందాన్ని తీసుకొచ్చింది. సాయిపల్లవి వీరాభిమానిగా సుమంత్ ప్రభాస్‌ను చూపించడం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. మంచిర్యాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, జయలలిత, శివాజీ రాజా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తున్నాడు.
