బాబు హయాంలో బార్లు పెరిగాయి: జగన్

బాబు హయాంలో బార్లు పెరిగాయి: జగన్

చంద్రబాబు హయాంలో స్కూళ్లు పెరగకపోయినా బార్లు మాత్రం విచ్చలవిడిగా పెరిగిపోయాయని వైఎస్ ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపడ్డా రు. పేద కుటుంబాలను ఆర్థికంగా గుల్ల చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. రాజధాని అమరావతి పేరుతో అమరేశ్వరుడి భూములనూ చంద్రబాబు వదల్లేదని మండిపడ్డా రు. 40 గుళ్లను కూల్చేశారన్నారు. రైతుల గిట్టు బాటు ధర కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బిజీ అయ్యా రని విమర్శించారు. రియల్ మాఫియాతో కుమ్మక్కై రూ.లక్ష కోట్లతో లోకేశ్ స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఇసుక దందాను ఎదురిం చిన మహిళా ఎమ్మార్వోను ఓ ఎమ్మెల్యే జుట్టు పట్టు కుని ఈడ్చుకె ళ్లినా చర్యలు తీసుకోలేదన్నారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్ విజృంభించి పేదలను ఆర్థికంగా పిప్పి చేసినా ఏ ఒక్కరికీ శిక్షలు పడలేదన్నారు. బాబు పాలనలో ఉద్యోగాలు రాక నిరుద్యోగులు పెరిగిపోయారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాక పొదుపు సంఘాలు బలహీన పడ్డా యని విమర్శించారు. నారాయణ కోసం ప్రభుత్వ స్కూళ్లు మూసివేత కేజీ నుం చి పీజీ వరకు ఉచిత విద్య గురిం చి చంద్రబాబు కనీసం ఊసైనా ఎత్తలేదని జగన్ విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల కోసం 6 వేల ప్రభుత్వ స్కూళ్లను మూసి వేయిం చారని మండిపడ్డా రు. రాష్ట్రంలో పోలీస్ స్టేష న్ల సంఖ్య పెరగలేదని, జన్మభూమి కమిటీల మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయని అన్నారు. 108 సర్వీసు లూ పనిచేయట్లేదన్నారు.మంత్రి యనమలకు పంటి నొప్పి వస్తేనే సిం గపూర్ కు పంపారని, కానీ, పేదలకు రోగమొస్తే పక్క రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం వర్తిం చకపోయినా స్పందిచట్లేదేని  ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటల సాగు విస్తీర్ణం, దిగుబడి పదేళ్ల స్థాయికి దిగజారిం దన్నారు.ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వాల్సింది పోయి రివర్స్ లో వాళ్ల దగ్గరన్నుం చే లాక్కున్ నారని ఆయన విమర్శించారు. గ్రానైట్ , పాలిషింగ్ యూనిట్ల విద్యుత్ చార్జీలు, రాయల్టీలు పెం చడం వల్ల పరిశ్రమలు మూతపడుతున్నాయన్నారు. ఇసుక  క్వారీల నుంచి మొదలైన చంద్రబాబు దోపిడీ అమరవాతి రియల్ ఎస్టేట్ వరకూ సాగిం దని మండిపడ్డా రు. రాష్ట్ర ప్రజలకు భద్రత కల్పి స్తానని చెప్పి.. ఆయన కుమారుడు లోకేశ్ కు మాత్రమే ఉద్యోగ, ఆర్థిక భద్రత ఇచ్చారంటూ ఆరోపిం చారు. ఎన్ని కల్లో ఓటమి తప్పదని భావిం చే గెలుపు కోసం చంద్రబాబు సర్వస్వాలూఒడ్డుతున్నారని, అందులో భాగంగానే జాతీయ నేతలను రాష్ట్రానికి రప్పిస్తున్నారని విమర్శించారు. బాబు ఎన్నికల వాగ్దా నాలను గుర్తుతెచ్చుకోవాలని, మరోసారి ఆయన మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు జగన్ సూచిం చారు. తాము అధికారంలోకి రాగానే నవరత్నాలతో అందరి జీవితాల్లో వెలుగులు నిం పుతామని హామీ ఇచ్చారు.