ఆ చిన్నారికి అవి రెండు...   100 కోట్ల మందిలో 10 మందికి ఇలాగే...

ఆ చిన్నారికి అవి రెండు...   100 కోట్ల మందిలో 10 మందికి ఇలాగే...

ప్రపంచంలో నిత్యం ఎక్కడొక చోట ఏదో రకంగా వింత ఘటనలు జరుగుతున్నాయి.  ఆరు కాళ్ల దూడ జన్మించిందని.. వరాహం గుళ్లో ప్రదక్షిణాలు చేస్తుందని... రెండు తలల బేబి జన్మిందని ఇలా అనేక వార్తలు వింటునే ఉన్నాం. తాజాగా ఇప్పుడు పాకిస్తాన్​లో రెండు పురుషాంగాలతో వింత శిశువు పుట్టాడనే వార్త సోషల్​ మీడియాలో వైరల్​ అయింది.

పాకిస్తాన్​లో వింత శిశువు

పాకిస్థాన్ లో వింత శిశువు జన్మించాడు.  రెండు పురుషాంగాలతో మూత్ర నాళాలతో  జన్మించిన పాకిస్తాన్‌లోని వైద్యులను ఆశ్చర్యపరిచింది రెండు పురుషాంగాలతో ఉన్న ఈ శిశువుకు మలద్వారం లేదని వైద్యులు తెలిపారు. ఈ పరిస్థితిని డిఫలియాగా చెబుతారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలాంటి కేసులు 100 వరకు ఉంటాయని పేర్కొన్నారు.  ఇలాంటి పరిస్థితి 100 కోట్ల మందిలో 10 మందికి  వైద్య నిపుఫులు చెపుతున్నారు.   రెండు పురుషాంగాల నుంచి మూత్రాన్ని విసర్జిస్తాడని వైద్యులు తెలిపారు.  డిఫాలియా అనే అరుదైన వైద్య పరిస్థితి కారణంగా శిశువుకు రెండు "సాధారణ ఆకారంలో" జననేంద్రియ భాగాలు ఉన్నాయి. శిశువుకు మలం పోవడానికి మలద్వారం లేదు. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో ఈ కేసు నమోదైంది. మొదటి కేసు 1609లో నమోదైంది.  

బాలుడికి రెండు మూత్ర నాళాలు


ఒక పురుషాంగం మరొకటి కంటే ఒక సెంటీమీటర్ పొడవుగా ఉందని, రెండూ మూత్ర విసర్జన చేయగలవని వైద్యులు తెలిపారు.  అతను మలాన్ని విసర్జించగలిగేలా కోలోనోస్కోపీతో ఓపెనింగ్ సృష్టించడానికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో మగ శిశువుకు చికిత్స అందించారు. బిడ్డ  పుట్టిన వెంటనే ఆసుపత్రిలోని అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. ఒక ఫాలస్ 1.5 సెంటీమీటర్ల పొడవు ఉండగా, మరొకటి 2.5 సెంటీమీటర్లు కొలుస్తారు. బాలుడికి రెండు మూత్రనాళాలకు ఒకే మూత్రాశయం జతచేయబడి, రెండు పురుషాంగాల నుండి మూత్రం వెళ్లేలా ఉంది.  శస్త్రచికిత్స తర్వాత రెండు రోజుల పాటు బాలుడును వైద్యులు  అబ్జర్వేషన్‌లో ఉంచారరు. ఆ తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేసి, తదుపరి అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ శిశువు ఆరోగ్యాని ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.