ఒక్క హిట్ తో.. శ్రీలీల ఆఫర్స్ కొట్టేస్తున్న బేబీ బ్యూటీ

ఒక్క హిట్ తో.. శ్రీలీల ఆఫర్స్ కొట్టేస్తున్న బేబీ బ్యూటీ

వైష్ణవి చైతన్య(Vishnavi Chaitanya).. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా ఈ పేరే వినిపిస్తోంది. బేబీ(Baby) సినిమాలో తన అద్భుతమైన నటనతో టోటల్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్(Allu Aravind) తన నెక్స్ట్ సినిమాలో వైష్ణవిని తీసుకుంటున్నట్టు ప్రకటించేశారు. దీంతో వైష్ణవి క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. 

ఇక తాజా సమాచారం మేరకు.. టాలీవుడ్ లేటెస్ట్ బ్యూటీ సెన్సేషన్ శ్రీలీల(Sreeleela)కు సైతం టఫ్ ఫైట్ ఇచ్చే రేంజ్ కు చేరుకుందట వైష్ణవి క్రేజ్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఉన్న టాప్ స్టార్స్ అందరి సినిమాల్లో ఈ అమ్మడే హీరోయిన్. అందులో పవన్ కళ్యాణ్(Pawan kalyan) ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagathsingh), మహేష్ బాబు(Mahesh babu) గుంటూరు కారం(Guntur kaaram), రామ్(Ram) స్కంద(Skanda), నితిన్(Nithin) ఎక్స్ట్రా(Extra), బాలకృష్ణ(Balakrishna) భగవంత్ కేసరి(Bhagavanth Kesari), వైష్ణవ్ తేజ్(Vaishnavi Chaitanya) ఆది కేశవ(Adhikeshava) వంటి సినిమాలున్నాయి. ఇక రీసెంట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో మరో పాన్ ఇండియా సినిమా చేయడానికి కూడా ఒకే చెప్పేసింది ఈ శ్రీలీల.

అయితే ఇప్పుడు శ్రీలీలని సైతం బీట్ చేసే రేంజ్ లో ఆఫర్స్ అందుకుంటోంది వైష్ణవి చైతన్య. ప్రస్తుతం వైష్ణవి చేతిలో దాదాపు 6 సినిమా ఉన్నాయని సమాచారం. త్వరలోనే ఈ సినిమాలకు సంబదించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇందులో ముందుగా శ్రీలీలను అనుకోని ఇప్పుడు వైష్ణవి చైతన్యను ఒకే చేసిన సినిమాలు కూడా ఉన్నాయట. ఒకే ఒక్క హిట్ తో స్టార్ హీరోయిన్ కి సైతం పక్కన పడేసేలా చేస్తోంది వైష్ణవి అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి బేబీ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకున్న వైష్ణవి తన తరువాతి సినిమాలతో ఆడియన్స్ ను ఏమేరకు మెప్పించనుందో చూడాలి.