ఎమ్మెల్యే హరిప్రియానాయక్ను నిలదీసిన ప్రజలు

ఎమ్మెల్యే హరిప్రియానాయక్ను నిలదీసిన ప్రజలు

భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లందు మండలం కొమరారంలో ప్రచారానికి వెళ్ళిన హరిప్రియ నాయక్ ను నిలదీశారు గ్రామస్తులు. తమ గ్రామానికి ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వాళ్లను అడ్డుకున్నారు. ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ మండలంలోని కొమరారం, పోలారం, మాణిక్యారం గ్రామాల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా తమ గ్రామానికి అభివృద్ధి చేయలేదని, కొమరారం మండలం ఏర్పాటుకు కృషిచేయలేదని, పోడు పట్టాల విషయంలో తమకు అన్యాయం జరిగిందని, అర్హులైన వారికి గృహ లక్ష్మీ పథకం వర్తించలేదని కోమరారం ప్రజలు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ను నిలదీశారు. ఎమ్మెల్యే సరియైన సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడంతో ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. సమాధానం చెప్పకుండా వెళ్ళి వెళ్లిపోయిన హరి ప్రియ నాయక్ కు ఈసారి ఎలా ఓటేస్తామని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ :- ఇంగ్లాండ్ కెప్టెన్ నన్ను అవమానించాడు.. బస్ డ్రైవర్ అని పిలిచాడు: మహ్మద్ కైఫ్